ప్రజావాణికి 109 ఫిర్యాదులు*
*
నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 09 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్ నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
*ప్రజాభవన్ ప్రజావాణి 11వ తేదీకి వాయిదా*
తెలంగాణ ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతీ మంగళవారం, శుక్రవారం మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్, బేగంపేట, హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని బుధవారం (ఈ నెల 11వ తేదీ)కు వాయిదా వేసిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో తేదీ 10.09.2024, మంగళవారం రోజున 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తున్న కారణంగా, మంగళవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తేదీ 11.09.2024 బుధవారానికి వాయిదా వేశారని అన్నారు.
కావున, అర్జీదారులు ఈ మార్పును గమనించి, తేదీ 10.09.2024 మంగళవారంకు బదులుగా, తేదీ 11.09.2024 బుధవారం నాడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.