
నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో పలు చోట్ల ఇళ్ళు కూలిపోవడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కోటగల్లిలో రెండు రోజుల క్రింద పసికంటి రాజేష్ ఇళ్ళు కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అనంతరం జరిగిన సంఘటనపై ఆర్ డీ ఓ గారితో ఫోన్ లో మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎన్ని అడగగా తడపడిన RDO గారిపైన మండిపడ్డారు సాయంత్రం వరకు నివేదిక ఇవ్వాలన్నారు, నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని ఆదేశించారు, అనంతరం మీడియా తో మాట్లాడుతు ఇటీవల కురుసరున్న భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు, ముఖ్యంగా నగరంలో శిథిల అవస్థలో ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టాలని ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు,రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు యుద్ధప్రాతిపదకన ఇళ్ళ నిర్మాణానికి 5 లక్షల ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేసారు,నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే బాధిత కుటుంబాలకు, అర్హులైన ప్రజలకు మంజూరు చేయాలనీ డిమాండ్ చేసారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద రావాల్సిన ఆర్ధిక సహాయం త్వరగా అందేలా చూస్తానని, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తన వంతు ఆర్ధిక సహాయం చేసి భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు పల్నాటి కార్తీక్,అంత రెడ్డి హరీష్ రెడ్డి, భాను, సురేష్, సుగంధం హరీష్, భాస్కర్,మఠం పవన్, ముందడ పవన్, మరవర్ కృష్ణ, బాబీ సింగ్,తదితరులు పాల్గొన్నారు.