Politics
నాలలో కొట్టుకుపోయిన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం
నిజామాబాద్, సెప్టెంబర్ 04(నిఘానేత్రంప్రతినిధి )
నిజామాబాద్ పట్టణంలోని ఆనంద్ నగర్ కాలనీలో నాలాలో కొట్టుకుపోయిన రెండు సంవత్సరాల బాలిక అనన్య కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అనన్య తన నివాసానికి సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఓపెన్ డ్రెయిన్‌లో పడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు.వారి కుటుంబానికి జరిగిన విషాదన్ని వారి తల్లిదండ్రుల గుండె కోతను ఎవరు కూడా పూడ్చలేరన్నారు.తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ గ్రియేష అందిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వ అధికారులు ప్రమాదకరమైన నాలాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.