Politics
*కలెక్టర్ ను కలిసిన బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు*
నిజామాబాద్, సెప్టెంబర్ 05 నిఘానేత్రం ప్రతినిధి: బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లుగా నియామకమైన ఐ.ఏ.ఎస్ అధికారులు వికాస్ మహతో, కిరణ్మయి కొప్పిశెట్టి గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలియజేశారు.