బీజేపీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
**
నిజామాబాద్, సెప్టెంబర్ 05( నిఘానేత్రం ప్రతినిధి )
భారత మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ రాధాకృష్ణన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఈ పదవిలో ఆయన విదేశీ రాజకీయాల్లో భారతదేశ ప్రతిష్టను పెంచడం జరిగిందని, భారత రెండవ రాష్ట్రపతిగా, డా. రాధాకృష్ణన్ పౌర హక్కులు, సాంస్కృతిక ఐక్యత, ప్రజాస్వామిక విలువలను కాపాడటానికి కృషి చేశారన్నారు.సెప్టెంబర్ 5న ఆయన జన్మదినం సందర్భంగా విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారన్నారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారని, ఆయన విద్యార్థుల పట్ల చూపించిన ప్రేమ, కృషి భారత విద్యా విధానంలో మార్గదర్శకంగా మారింది. ఆయన ఉపన్యాసాల ద్వారా విద్యారంగంలో అత్యున్నత విలువలను ప్రోద్భలించారన్నారు.
ఈ కార్యక్రమంలో పొతన్ కర్ లక్ష్మీనారాయణ, శివరాజ్ కుమార్. రుణదేష్ శర్మ పంచ రెడ్డి ప్రవళిక. గంగోని సంతోష్. ఉప్పు సవిత. యామాద్రి భాస్కర్. తిరుపతి రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.