Politics

గణేష్ విగ్రహాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరణ.*

*

నిజామాబాద్, సెప్టెంబర్ 05(నిఘానేత్రం ప్రతినిధి )

వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పించేందుకు. మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (రెవెన్యూ) & అదనపు కలెక్టర్ అంకిత్ (లోకల్ బాడిస్), మకారందు (మున్సిపల్ కమిషనర్) పాల్గొన్నారు.

పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలొ భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు టీ జి పి సి బి నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలొ బాగంగా రాష్ట్ర వ్యాప్తం గా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ఆటోట్రాలీ ల ద్వారా పర్యావరణ సందేశంలతో ప్రదర్శన, ప్రింట్, ఎలక్ట్రనిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు టీజీపీసీబీ సిద్దమౌతుంది. మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణ పై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ, ఆటోల వెనుక, పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్ లలో హోర్డింగ్ లు మట్టి గణేష్ ల ద్యారా పర్యావరణ పరిరక్షణ పై కళాజాత కూడ నిర్వహించడం జరుగుతోంది.

చెరువుల్లో మట్టి మేటలని తొలిగించటానికి చెరువులో స్వచ్ఛత కాపాడటానికి వినాయక చవితి సందర్బంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలాని మట్టి తో వినాయక విగ్రహాలు తాయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button