ఇందూర్ అర్బన్ గణేష్ మండపలకు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సహకారం
నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: ధన్ పాల్ లక్ష్మీ బాయ్ &విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ గణేష్ మండపాలకు రెండో రోజు ధన్పాల్ సూర్యనారాయణ
ఆర్ధిక సహకారం కార్యక్రమాన్ని కొనసాగించారు రెండో రోజు కూడా భారీగా మండపం నిర్వాహకులు రావడంతో వారికీ ఇబ్బంది కలుగ కుంట పది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు గత పదేళ్లుగా ధన్ పాల్ లక్ష్మీ బాయ్ &విఠల్ గుప్తా ట్రస్ట్ పేరుమీద ఇందూర్ నగర గణేష్ మండపాలకు తన వంతు ఆర్ధిక సహకారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు నిర్వహించడం జరిగిందని అన్నారు, రెండు రోజుల్లో దాదాపు ఏడు వందల మండపలకు సహకారం అందించడం జరిగిందన్నారు, హిందూ ధర్మ రక్షణ మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం హిందువుల్లో ఐక్యత పెంపొందించే ప్రతి కార్యక్రమానికి తన సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని తెలియజేసారు,మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ ఇందూర్ అర్బన్ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో ధనపాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.