Politics
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : కలెక్టర్*
*
నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 06 : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన గణేష్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆశాభావం వెలిబుచ్చారు. పర్యావరణానికి హాని కలుగని విధంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు.