Politics
పిసిసి అధ్యక్షులుగా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు* – *జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి*
*
NSUI నాయకులుగా రాజకీయ ప్రవేశం చేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమింపబడిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.nsui నాయకులుగా ప్రారంభించి జిల్లా NSUI అధ్యక్షులుగా ఎంతో కష్టపడి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు రెండు సార్లు డిచ్పల్లి,నిజాబాద్ అర్బన్ నుండి ఎంఎల్ఏ గా పోటీ చేయడం జరిగిందని ఎంతో కష్ట పడే తత్వం కలిగిన వ్యక్తి ఆయన అని అన్నారు.నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ ఎల్లప్పుడూ కార్యకర్తలు అందుబాటులో వుండే మా జిల్లా నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ అధ్యక్షుడు పదవి రావడం సంతోషంగా వుందని,కష్టపడే వారికి గుర్తింపు వుంటుంది అనే వారికి ఇది నిదర్శనం అని అన్నారు.