జర్నలిస్ట్ బొబ్బిలి నర్సయ్య కు ఘనసన్మానం*
*నిజామాబాద్, సెప్టెంబర్ 06( నిఘానేత్రం ప్రతినిధి )
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అనుబంధ సంస్థ అటాక్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన నిజామాబాదు జిల్లాకు చెందిన డాక్టర్ బొబ్బిలి నర్సయ్యను మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
సన్మానించారు.శుక్రవారం హైదరాబాదులోని బూర్గుల రామక్రిష్ణ భవన్‌లో ఉన్న మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బొబ్బిలి నర్సయ్యను సన్మానించారు.
అనంతరం బషీర్ బాగ్ లోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ డాక్టర్ బొబ్బిలి నర్సయ్యను ఘనంగా సన్మానించారు.తనను అటాక్స్ కమిటీ కన్వీనర్ గా నియమించిన కె.శ్రీనివాస్ రెడ్డి, విరహత్ అలీలకు
ఈ సందర్భంగా బొబ్బిలి నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె ఐజెయు జాతీయ కౌన్సిల్
సభ్యులు చింతల గంగాదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రమోద్ గౌడ్,
జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, బాలాజీ, కోశాధికారి సిరిగాద ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ్ రెడ్డి, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి
బైర శేఖర్, ఉపాద్యక్షులు జెట్టి గోవిందరాజు, అక్రిడిటేషన్ కమిటి సభ్యులు కొక్కు రవి, పాకాల నర్సింలు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుంకరి రాజేశ్, సంఘంకార్ ధనుంజయ్, సీనియర్ పాత్రికేయులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.