Politics
*బోధన్ ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన పిసిసి అధ్యక్షులు
నిజామాబాద్,సెప్టెంబర్ 09 (నిఘానేత్రం ప్రతినిధి )
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్ సోమవారం హైదరాబాద్ లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు..ఆయనతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ,పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు ఏ బి శ్రీనివాస్, మెండోరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.