మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇందూర్ కవి శ్రీమన్నారాయణ చారీ విరాట్ కు వీరరస కావ్య పురస్కారం*
నిజామాబాద్, సెప్టెంబర్ 09 (నిఘానేత్రం ప్రతినిధి )
గ్వాలియర్ లో ఏర్పాటుచేసిన
రాష్ట్ర భాష మహాత్సవ్ లో భాగంగా అఖిల భారతీయ సాహిత్యకారుల సమ్మేళనం మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగరంలోని బ్లూస్టార్ హోటల్ లో ఘనంగా నిర్వహించినట్లు,ఈ కార్యక్రమం మాజీ హోమ్ మంత్రి డా.నరోత్తమ్ మిశ్రా అద్ర్యక్షతన, జగత్ శర్మ సమన్యయంతో నగరమంతా సద్గ్రంథా శోభ యాత్ర నిర్వహించిన అనంతరం సమావేశమయ్యారు . ఈ కార్యక్రమం లో దేశ నలుమూలల నుండి వచ్చిన కవులు, రచయితలు సాహిత్యకారులు పాల్గొన్నారు. మొదటి రెండు సెషన్ లలో వివిద సాహితీ ప్రక్రియల మీద చర్చ జరిగిన అనంతరం నవరస ప్రధానమైన కవిసమ్మేళవాన్ని ఏర్పాటు చేసారు. తొమ్మిది మంది కవులలో మన జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణచారి” విరాట్ నకు వీరరస కవితాపఠనం చేసే అవకాశం లభించింది. తన వీరరస ప్రధానమైన కవితాభివ్యక్తి ఆహుతులను మంత్రముగ్దల్ని చేసిందని ఇందూర్ కవి శ్రీమన్నారాయణ చారీ విరాట్ తెలిపారు.ఈ సందర్బంగా నిర్వాహకులు శ్రీమన్నారాయణచారి ‘విరాట్” కు విశిష్ప వీరరస కావ్యపురస్కారాన్ని అందజేశారు.ఇందూర్ జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణ చారీ విరాట్ మాట్లాడుతూ ఉద్దండులు నిండుగా ఉన్న సభలో వేదిక మీద కవితా పఠనం చేసే అవకాశం రావడం ఆనందం కలిగించిందని తనకు వీరరస కావ్యపురస్కారం లభించడం గర్వంగా ఉందని తెలుపుతూ తన గురువులను స్మరించుకున్నారు..ఈ కార్యక్రమాంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ గృహమంత్రి నరోత్తమ్ మీశ్రా, భోపాల్ విశ్వవిద్యాలయ కులపతి డి .కే . సురేశ్, పార్లమెంట్ సభ్యులు వీరేంద్ర కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ వినోద్ భార్గవ్ లు పాల్గొన్నట్లు తెలిపారు.