సుబ్రహ్మణ్యస్వామి వారికీ వెండి మయూరి కిరీటం బహుకరణ
**
నిజామాబాద్, సెప్టెంబర్ 09( నిఘానేత్రం ప్రతినిధి )
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బోర్గం(పి )గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడు చింతకాయల రాజేందర్ 1.1/2 వెండితో నెమలి కిరీటం తయారు చేసి స్వామివారికి సమర్పించారు.ఈ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా జరిపించారు.మొదట ఆలయంలో ప్రతేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అర్చన, అభిషేకం అనంతరం మయూర కిరీటాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగా సుబ్రహ్మణ్య స్వామికి బహుకరించారు. ఈ సందర్బంగా
నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, మనిషి ఎదుగుదలకు ఆధ్యాత్మికం ఎంతో అవసరమని “ఇటువంటి పూజా కార్యక్రమాలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని గుర్తుచేస్తాయని ఇది భక్తుల భక్తి, విశ్వాసం, మరియు సమర్పణకు ప్రతీక అని అన్నారు. ఆలయ అభివృద్ధి కేవలం భవనం మాత్రమే కాదు, భక్తుల ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శనం కూడా. ఈ వెండి కిరిటం స్వామివారి పట్ల భక్తుల ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు ప్రముఖ పాత్ర పోషించిన రాజేందర్ ని అభినందించారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ ముందడ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.