పర్వతారోహకుడిని అభినందించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ*
*
నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 10 : పర్వతారోహణ పట్ల అభిరుచిని పెంపొందించుకుని ప్రపంచ ప్రఖ్యాత పర్వతాలను అధిరోహిస్తున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన ఏ.మారుతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ అభినందించి శాలువాలతో సత్కరించారు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించేందుకు సమాయత్తమైంది మారుతి, ఇప్పటికే కిలిమంజారో పర్వతాన్ని, రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రోస్ పర్వతాలను అధిరోహించడం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న మారుతి ఎవరెస్టు అధిరోహణ లక్ష్యాన్ని సైతం సాధించాలని ఆకాంక్షించారు. పర్వతారోహకుడు మారుతికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు.