*చిన్న పత్రికల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి*
*1.చిన్న పత్రికలకు అర్హతను బట్టి ఎన్‌ప్యానెల్‌లో చేర్చుకోవాలి* *2. పెద్ద పత్రికలతో సమంగా అక్రిడిడేషన్,ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి* *3.సొంత ప్రెస్‌లు ఉన్న పత్రికల యాజమాన్యాలకు తప్పని సరిగా ప్రెస్ కోసం స్థలాలివ్వాలి* *4. ప్రభుత్వ కార్యక్రమాలు కవర్ చేసేందుకు అక్రిడిడేషన్ లేకపోయినా పత్రిక యాజమాన్యం ఇచ్చే కార్డు హోల్డర్లను అనుమతించాలి.* *5.అసెంబ్లీ,సెక్రటేరియట్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే మీడియా సమావేశాలకు చిన్న పత్రికలకు అనుమతి ఇవ్వాలి.* *6.చిన్న పత్రికలలో పని చేసే విలేకరులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అలాగే చిన్న పత్రికల సంస్థలకు ఒక చోట ఇళ్లస్థలాలకు ప్రభుత్వ భూమి మంజూరు చేయాలి* *ఈ చిన్న కోర్కెలను మన్నించి, వాటిని పరిష్కరిస్తానన్న నమ్మకంతో ప్రభుత్వం పట్ల భరోసాతో ఉన్నాం. దయచేసి మా వినతిని పరిశీలించాలగలరని మనవి*
తెలంగాణ రాష్ట్రంలో చిన్న పత్రికలు గత ప్రభుత్వ హయాం నుంచి మరణశయ్యపై ఉన్నాయి. సొంత పత్రికలు,ఛానెళ్లను అభివృద్ధి చేసుకునేందుకు ఆసక్తి చూపిన గత ప్రభుత్వ వైఖరి కారణంగానే చాలా చిన్న పత్రికలు మూతపడ్డాయి. మరికొన్ని పత్రికలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వ వైఖరి కారణంగా వెగచిపోయిన చిన్నపత్రికల యజమానుల కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని,రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బతుకులు బాగుపడతాయని ఏకమొత్తంగా మద్దతు తెలపడమే కాకుండా తమ పత్రికల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయం మీకు తెలిసినదే.
శ్రీ రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట చిన్న పత్రికలు బతికి బట్టకడతాయని, అక్రిడిడేషన్,ప్రకటనల విషయంలో మార్పు వస్తుందని భావించాము. అలాగే చిన్న పత్రికలకు, అందులో పని చేసే పాత్రికేయులకు ఇళ్లస్థలాలు వస్తాయని ఎంతగానో ఆశించాము. ఇప్పటికి కూడా తమ/ మా ప్రభుత్వం పట్ల విశ్వాసం ఇనుమడిస్తోంది.
చిన్న పత్రికలకు ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రకటనలు పూర్తిగా తగ్గిపోయాయి. కారణం పెద్ద పత్రికలు వ్యవహరిస్తున్న తీరే కారణం. అలాగే ఏ పార్టీలకు ఆ పార్టీ పత్రికలు ఉండటం వల్ల రాజకీయ ప్రకటనల పూర్తిగా తగ్గిపోయాయి. మరో వైపు కరోనా తర్వాత పెరిగిన ప్రింటింగ్, న్యూస్‌ప్రింట్ వ్యయం భరించలేనిదిగా ఉంది. చిన్న పత్రికలు ఈ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి అక్రిడిడేట్ ఉన్న విలేకరులే హాజరుకావాలని గత ప్రభుత్వం నిర్ణయించి అమలు చేయడంతో చిన్న పత్రికల్లో విలేకరులు పని చేయడానికి సాహసించడం లేదు. విలేకరులు పని చేయక, ప్రకటనల ఆదాయం లేక, ప్రభుత్వం నుంచి ప్రకటనలు రాక చివరకు పత్రికల నిర్వహణ మరింత భారంగా మారింది. మరో పత్రికల్లో పని చేసే అవకాశం లేక పూర్తిగా ఉపాధి కోల్పోయే స్థితిలో చిన్న పత్రికలున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి దయతో చిన్న పత్రికలను ఆదుకొని, పెద్ద పత్రికలతో సమంగా ప్రకటనలు అక్రిడిడేషన్ సౌలభ్యం కల్పిస్తే ఎంతో మేలు చేసినవారవుతారు.
పెద్ద పత్రికల కంటే చిన్న పత్రికలే ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పెద్ద పత్రికల్లో ప్రభుత్వ కార్యక్రమాలు సింగిల్ కాలం కంటే ఎక్కువ రావు. కానీ చిన్న పత్రికల్లో అరపేజీ,ఫుల్ పేజీ కేటాయించి, ఫోటోలు వేసి, అందంగా డిజైన్ చేసి ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం.
ఇప్పుడు సోషల్ మీడియా,డిజిటల్ మాధ్యం వచ్చిన తర్వాత ప్రజలు పెద్ద పత్రికలు కంటే చిన్న పత్రికలపై నే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు నేరుగా త్వరగా చిన్న పత్రికల ద్వారానే వెళ్లడానికి సాధ్యమవుతుందనే విషయాన్ని సమాచారశాఖా మంత్రిగా మీరు గ్రహించాలి.
గతంలో చిన్న పత్రికలతో సమంగా తొలి,మలి వెంచర్లలో(జూబ్లీహిల్స్,గోపన్నపల్లె) ఇళ్లస్థలాలు ఇచ్చిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వం చిన్న పత్రికలను విభజించి ఇళ్లస్థలాలు కేవలం పెద్ద పత్రికలు, ఛానెళ్లల్లో పని చేసేవారినే తీసుకొని చిన్న పత్రికల విలేకరులకు మొండి చెయ్యి చూపిస్తున్నారు.
దీని వల్ల జర్నలిస్టులుగా దీన్ని ఉపాధిగా మార్చుకోవాలనే ఆశతో చాలా మంది ఈ రంగంలోకి వస్తున్నారు. ఇప్పుడు పాత్రికేయరంగం యువత ఆశలను నీరుగారుస్తోంది. దీనికి కారణం గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరేనని చెప్పవచ్చు.
మీరు విజ్ఞులు. పాత్రికేయ వ్యవస్థను క్షుణ్ణంగా గమనించిన వారు. క్షేత్రస్థాయిని పరిశీలించిన వారు..మీకు తెలియని సమస్యలు కావివి. అయినప్పటికీ మీ దృష్టికి తీసుకురావాలనే ఆశతో, మీరు వీటిని పరిష్కరిస్తారన్న ఆకాంక్షతో తెలంగాణ న్యూస్ పేపర్ అసోసియేషన్ ఉంది. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు కోయిల్ కార్ రామ్ దయానంద్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ అజిద్ రాష్ట్ర సంఘ సభ్యులు కలిశారు