ఖమ్మం వరద బాధితులకు ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి సంఘం ఆర్థిక సహాయం*
*
నిజామాబాద్, సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి)
ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాజా గౌడ్ కు 11,000 రూపాయల చెక్కును జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు అందజేశారు. ఆర్డీవో రాజా గౌడ్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి తమవంతుగా ఆర్థిక సాయం అందించిన జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందిస్తున్నామని అంతే కాదు ప్రతీ ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలని సమైఖ్య కాలని పేరుతో రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేయడాన్ని కోనియాడారు.
ఖమ్మంలోజిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇదే తీరుగా ఆర్మూర్ పట్టణ కాలొనిలు ముందుకు వచ్చి మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు రావాలని, దేవుళ్ళ పేరిట ఇతరాత్ర కార్యక్రమాలు చేసే మనం వర్షాల వల్ల మన సాటి మనుషులు ఇబ్బంది పడితే
కనికరించక పోవడం విచార కారణమని మానవ సేవయే మాధవ సేవ అనే పదాన్ని నిత్యం జపించే మనం ముందుకు వచ్చి నిరూపించాలని దానికి రాజకీయాలకు అతీతంగా యువత ప్రధాన పాత్ర పోషించాలని జర్నలిస్ట్ కాలనీ సభ్యులు విజ్ఞాప్తి చేశారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
సుంకే శ్రీనివాస్, అభివృద్ధి కమిటి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, క్యాషియర్ సత్యనారాయణ గౌడ్, కొంతం రాజు, గడ్డం శంకర్,
ఎర్ర భూమయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.