గణేష్ నిమజ్జన శోభాయాత్ర సజావుగా జరగాలి* -జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ
కామారెడ్డి సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి )
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాలను బుధవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
స్టేషన్ రోడ్డు, గంజి రోడ్, పెద్ద బజార్, నిజాంసాగర్ చౌరస్తా మీదిగా కొత్త బస్టాండ్, ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలు శోభయాత్ర కు ఆటంకం కలగకుండా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని విద్యుత్, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు శోభయాత్ర మార్గంను చూశారు. పెద్ద చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పోలీసు అధికారులకు సూచించారు. గణేష్ మండపాల వారు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను ఉంచాలని తెలిపారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సైలు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.