Home

ఆర్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించే క్విజ్ పోటీలో పాల్గొనండి* -లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్

నిజామాబాద్, సెప్టెంబర్ 11 ( నిఘానేత్రం ప్రతినిధి )

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపించబడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఆన్ లైన్ క్విజ్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ అశోక్ చౌహన్ తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 17 వ తేదీ లోగా ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇద్దరు విద్యార్థులు ఒక టీం గా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాలు అన్ని కళాశాలల నిర్వాహకులకు పంపించడం జరిగిందన్నారు. నాలుగు దశలలో ఈ క్విజ్ పోటీలు ఉంటాయని తెలిపారు. మొదటి దశలో ఇంటి వద్ద నుండే విద్యార్థులు పాల్గొనవచ్చని సూచించారు. అనంతరం జరిగే రెండు, మూడు, నాలుగు దశల క్విజ్ పోటీలకు మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి భారీగా నగదు బహుమతి, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ను ఆర్.బీ.ఐ, హైదరాబాద్ వారిచే అందించడం జరుగుతుందని ఎల్.డీ.ఎం వివరించారు. డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button