క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం కోసమే డి ఎస్ స్మారక క్రీడలు* -క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి
*
నిజామాబాద్, సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి )
క్రీడాకారులను ప్రోత్సహించడం కోసమే ధర్మపురి శ్రీనివాస్ స్మారక క్రీడ పోటీలు నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని నగర మాజీ మేయర్, సొసైటీ అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. ఈ మేరకు బుధవారం వినాయక నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీ.శే. ధర్మపురి శ్రీనివాస్ 76 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ధర్మపురి శ్రీనివాస్ స్మారక జిల్లా స్థాయి క్రీడా పోటీలు సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ పోటీలను పాఠశాల, ఇంటర్మీడియట్ బాల, బాలికలకు వేరు వేరుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పాల్గొంటున్న క్రీడాకారులకు మధ్యాహ్నం బోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్రీడలు స్థానిక డిఎస్సీ మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ సొసైటీ ఆద్వర్యంలో ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహించాలని నిర్ణయించామని , మొదటి రోజు ఉదయం 9 గంటలకు మార్చ్ ఫస్ట్ ఉంటుందని, క్రీడాకారులు సకాలంలో హాజరు కావాలని . మార్చ్ ఫాస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ బహుమతి రూ.5000, ద్వితీయ బహుమతి 2000 రూ నగదు పురస్కారం ఇవ్వబడుతుందని , ప్రతి పాఠశాల నుంచి గేమ్ కు 10 వరసలు ఉంటేనే పాల్గొనడానికి అర్హులని అన్నారు.క్రీడాకారులకు మధ్యాహ్నం క్రీడలు నిర్వహించు రోజులలో భోజన వసతి కలదని,క్రీడాకారులు పాఠశాల కళాశాల తరపున మాత్రమే పాల్గొనవలెనని, క్రీడాకారులు టీం ఎంట్రీస్ సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు ఈ క్రింద తెలిపిన లింక్ హెచ్టీటీపిఎస్/డిఎస్-మెమోరియల్ టోర్నమెంట్, ఇన్ఫో గాని, వాట్సప్ నంబర్
విద్యాసాగరరెడ్డి పీడీ 9440066250, ఎ. రమేష్ పీడీ 9440007004లకు పంపగలరని కోరారు. తర్వాత వచ్చిన ఎంట్రీస్ తీసుకొనబడవని, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్ లో ప్రతిటీమ్ నుండి 10మంది క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలని, ఖో ఖో లో 12 మంది క్రీడాకారులు పాల్గొనాలని, పాఠశాల కళాశాల క్రీడాకారులకు వేరువేరుగా క్రీడలు నిర్వహించబడునని, పోటీలలో కామన్ ప్లేయర్స్ లేకుండా చూసుకోవాలని అన్నారు. పాఠశాల తరపున ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులు, కళాశాల తరఫున ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాత్రమే అర్హులని, క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.10 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.5 వేలునగదు,బాక్సింగ్ లో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు రూ.3 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు రూ. 2 వేలు రూపాయలు నగదు బహుమతి
బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు . క్రీడలలో గెలుపొందిన వారికీ షిల్డ్, నగదు బహుమతి, వ్యక్తి గత బహుమతులు ఇవ్వబడుతుందని అన్నారు. ఇతర వివరాలకు ధర్మపురి సంజయ్ 7774956789, డి.సాయిలు 9848060999, సురేష్ 9948287937, విద్యా సాగర్ రెడ్డి 9440066250 లను సంప్రదించాలని కోరారు. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా , అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అర్జున అవార్డు గ్రహీత హుస్సముద్దిన్, మాలావత్ పూర్ణ, గుగులోత్ సౌమ్య ఇతర క్రీడాకారులు పాల్గొననున్నారని అన్నారు.