*మెగా ప్యాకింగ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటం * చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు*
నిజామాబాద్ సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగరంలో డ్రింకింగ్ వాటర్ పేరుతో కొనసాగుతున్న కంపెనీలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టారాజ్యంగా వివరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ప్రభుత్వ ఆదేశాలను సారము డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లను నిర్వహించే యజమానులు నీటిని శుద్ధి చేసిన తర్వాత ల్యాబ్ లో టెస్ట్ చేసి ఆ నీటి నాణ్యత నిర్ధారణ అయిన తర్వాత ఆ వాటర్ ను సప్లై చేయవలసి ఉంటుంది కంపెనీలు ప్రారంభించే సమయంలో అధికారులకు వాటర్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసి టెక్నీషియన్ ను పెట్టి నిబద్దలకు అనుగుణంగా ఉన్నాయని చూపించి అధికారులు తనిఖీలు పూర్తయిన తర్వాత నిబంధనలను మరచి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు వాటర్ బాటిల్ లను శుద్ధి చేయకుండా సంవత్సరాల తరబడి పాత బాటలను వాడుతూ ఉన్నారు నిజామాబాద్ నగరంలోని మెగా వాటర్ కంపెనీ పూర్తి నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ సంవత్సరాల తరబడి వాడిన పాత వాటర్ క్యాన్ లను వాడుతూ ప్రజల బాణాలతో చెలగటమడుతున్నారు. ఈ కంపెనీపై అధికారులు తనిఖీలు మరిచి పోయారో తనిఖీ చేయొద్దనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఏమైనా వచ్చాయో లేదా అధికారులకు అధికారాలు లేవో తెలియట్లేదు ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుకు మాత్రమే ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న మెగా వాటర్ పై తనిఖీ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు