*బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం* *పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవర్*
నిజామాబాద్ ,సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిది )
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం విపరీతంగా పెరిగిపోయిందని, దీని ఫలితంగా సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ముప్పు వాటిల్లుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్వేశ్వర్ సింగెనవర్ దృష్టికి రావడంతో
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు నిజామాబాద్ వీదుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల ముఖ్యంగా మహిళలు,పిల్లల పట్ల అసభ్యకరమైన, వికృత అసభ్యకరమైన ప్రవర్తనను, ప్రదర్శిస్తున్నట్లు నివేధికలు సూచిస్తున్నాయని సాధారణంగా రోడ్డు వినియోగదారులకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు చికాకు ఆటంకము కలిగించి ప్రజాప్రశాంతతకు దారితీస్తుందన్నారు.ఇటువంటి వికృత, అసభ్య ప్రవర్తన వలన పౌరులలో ముఖ్యంగా మహిళలు పిల్లలలో భయాందోళన భావాన్ని కలిగిస్తుందని . దీని ఫలితంగా నిజామాబాద్ కమీషనరేటు వీదుల్లో వారి స్వేచ్చా సంచారాన్ని నిరోధించడం ద్వారా ప్రజల భద్రత పై పెద్ద మొత్తంలో ప్రభావం చూపుతుందని . మానవ ప్రాణాలకు భద్రత భద్రతకు గల ప్రమాదాన్ని నివారించడానికి లేదా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా నిరోధించడానికి ఈ విషయంలో త్వరిత చర్యలు తీసుకోవడం అవసరమని భావించి
వాటిని పరిగణంలోనికి తీసుకొని, అండర్ సెక్షన్ 22(1) (డి) హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఎఫ్ ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్వేశ్వర్ సింగెనవర్, ఆదేశించారు.
నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ గురువారం ఆదేశాలు జారీజేశారు.
ఇట్టి ఉత్తర్వులు తేది: 11-9-2024 ఉదయం 6 గంటల నుండి తేది: 30-9-2024 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు.( ఈ రెండు రోజులు కలుపుకొని)
ఇట్టి ఉత్తర్వులను ఉల్లంఘించి నట్లయితే వారిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223, హైదరాబాద్ సిటీ పోలీస్ 1348 ఫాస్లీ లోని సెక్షన్ & (76) ప్రకారం శిక్షకు అర్హులవుతారని తెలిపారు.