*మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష*
జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దన్న సీఎం.
ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం.
పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15రోజుల్లోగా అందించాలన్న సీఎం.తప్పుడు రిపోర్ట్ లు ఇస్తే అధికారులపైనా చర్యలు తప్పవన్న సీఎం.ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్ జెండర్ లను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలన్న సీఎం.
హోమ్ గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్న సీఎం.
ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశించిన సీఎం. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు. పాల్గొన్నారు