*తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ కమిషన్ సభ్యులు ఈ రోజు పూర్వ బీసీ కమిషన్ అధ్యక్షులు సభ్యులతో సమావేశమై బీసీల “కుల గణన” మరియు రిజర్వేషన్ ల విషయమై సంప్రదింపులు చేయటం జరిగింది*
హైదరాబాద్ సెప్టెంబర్ 14(నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ కమిషన్ సభ్యులు ఈ రోజు పూర్వ బీసీ కమిషన్ అధ్యక్షులు సభ్యులతో సమావేశమై బీసీల “కుల గణన” మరియు రిజర్వేషన్ ల విషయమై సంప్రదింపులు చేయటం జరిగింది.
ఈ సమావేశం లో పాల్గొన్న సభ్యులకు తాము గతం లో సేకరించినటువంటి సమాచారాన్ని సమావేశం లో వ్యక్తపరచి ప్రస్తుత కమిషన్ కు అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని తెలపడం జరిగింది. తరుచుగా సమావేశమై పరస్పర చర్చలు జరుపుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సమావేశం లో ఛైర్మన్ శ్రీ జి.నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి బాల లక్ష్మి గార్లు పాల్గొనగా పూర్వ బీసీ కమిషన్ ఛైర్మన్ శ్రీ.బి.ఎస్. రాములు, డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మరియు సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ , జూలూరి గౌరీ శంకర్, సి.హెచ్, ఉపేంద్ర, శుభ ప్రద్ పటేల్, కే. కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.