*ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి పూజలు నిర్వహించిన కలెక్టర్* నిజామాబాద్, సెప్టెంబర్ 13 : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. శుక్రవారం నాటి పూజలలో జిల్లా పాలనాధికారి పాల్గొని, ప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ————————- నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది
నిజామాబాద్, సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి) : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. శుక్రవారం నాటి పూజలలో జిల్లా పాలనాధికారి పాల్గొని, ప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.