Politics

*గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు* *మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా* *ప్రజా భవన్ లో జరిగే ప్రజా వాణి లో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు* *గల్ఫ్ కార్మిక కుటుంబాల పిల్లలకు గురుకులాల్లో సీట్లు* *గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవల్సిన చర్యల పై సలహాలు, సూచనలు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్*

హైదరాబాద్(నిఘానేత్రం ప్రతినిధి) ,సెప్టెంబర్ 14: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో రూపొందిన గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాల పై సమావేశంలో చర్చించారు. అందులో ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీ నీ ఏర్పాటు చేయాలని అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , నాయకులు ఈ కమిటీ లో సభ్యులుగా నియమించి ఇందుకోసం జీవో విడుదల చేయాలని సూచించారు. హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రతి మంగళవారం , శుక్రవారం ప్రజావాణి లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణి లో ఈనెల 20 వ తేది నుండి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలలో, కళాశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో చదవాలని అనుకునే వారికి 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 డిసెంబర్ 2023 నుండి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రెషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని NRI సెల్ సూచించింది. దీనిని తెలంగాణ ఏర్పడినప్పటి రోజు జూన్ 2 ,2014 లేదా ఏరోజు తీసుకుంటే బాగుంటుందనే దానిపై కమిటీ లు పలువురు సూచనలు చేశారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మేల్యేలు ఇతర ముఖ్య నేతలు పలు సలహాలు సూచనలు చేశారు. ఇప్పటికే తన వేములవాడ నియోజకవర్గానికి చెందిన గల్ఫ్ లో మృతి చెందిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సిఎంఆర్ఎఫ్ నుండి వారికి ఎక్స్ గ్రెషీయా ఇచ్చినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరి గల్ఫ్ భీమా ఉండాలని సూచించారు. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సింగపూర్ , మలేషియా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సూచించారు. టీపిసిసి ఎన్ఆర్ఐ కన్వీనర్ ఇమిగ్రేషన్ 1982 యాక్ట్ లో గల్ఫ్ దేశాల్లో 18 దేశాలు ఉంటాయని అందులో సింగపూర్ లాంటి దేశాలు కూడా గల్ఫ్ కిందకి వస్తాయన్నారు.తెలంగాణ లో 150 ట్రెడ్ లైసెన్స్ మన్ పవర్ ఎక్సపోర్ట్ కంపెనీలు ఉన్నాయని సెట్వీన్, టాంటం, న్యాక్ లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలనీ సూచించారు. ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతుందని అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే శవం రావడానికి వారం రోజులకు పైగా పడుతుందని దానిని 48 గంటల్లో ఇక్కడికి వచ్చేలా చూడాలని తెలిపారు. దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ కేరళ రాష్ట్రంలో ఉందని అక్కడ ఉన్న దానిని స్టడి చేయాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కేరళ లో జీడీపీ కి ప్రధానంగా గల్ఫ్ కార్మికుల ద్వారా వస్తుందని తెలంగాణ లో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగాలని సూచించారు.

సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,ఎమ్మేల్యేలు డా,,సంజయ్ రేకులపల్లి భూపతి రెడ్డి , కెఆర్ నాగరాజు , మేడిపల్లి సత్యం, వాకిటి శ్రీహరి ముదిరాజ్ ,సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి,మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెలిచాల రాజేందర్ రావు , వినయ్ రెడ్డి NRI సెల్ చైర్మన్ వినోద్ ,తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button