Politics

*సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను ప్రారంభించిన ఎంపీ*

* నిజామాబాద్ , సెప్టెంబర్ 14 ( నిఘానేత్రం ప్రతినిధి )

నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఖేలో ఇండియా ద్వారా నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ , అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కుమారి నిషా విద్యార్థి , జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి , నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి , తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయకాంతరావు ,వందలాది

మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button