Politics
*జర్నలిస్ట్ కాలనీ గణేష్ మండపం వద్ద మహా అన్నప్రసాద వితరణ*
నిజామాబాద్ ,సెప్టెంబర్ 14 ( నిఘానేత్రం ప్రతినిధి )
నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి నగర్లో ఉన్న జర్నలిస్ట్ కాలనీలో గణేష్ మండపం వద్ద శనివారం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.అన్నప్రాసద కార్యక్రమంలో నగరంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కుటుంబ సభ్యులతో పాటు కాలనీ జర్నలిస్టు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నగర సీఐ నరహరి, నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ లు విచ్చేసి పూజలు జరిపించి అన్నప్రాసదలను స్వీకరించారు. ఈ సందర్బంగా జర్నలిస్ట్ కాలనీ సంఘ అధ్యక్షుడు జెట్టి గోవిందరాజ్, కార్యదర్శి మల్లెపూల నరసింహ చారి లు సిఐ,ఎస్ఐ లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.