Politics

*సిజనల్ వ్యాధులపై జిల్లా వైద్యాధికారి సమీక్ష*

నిజామాబాద్, సెప్టెంబర్ 14(నిఘానేత్రం ప్రతినిధి )

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై మలేరియా సబ్ యూనిట్ అధికారులు,నోడల్ సూపర్వైజర్లు , ల్యాబ్ టెక్నీషియన్లు, బ్రీడింగ్ చెక్కర్స్ సిబ్బందితో సమీక్ష సమావేశం ను పిఓడిటి వద్దశనివారం నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలియజేశారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, సూపర్వైజర్ సిబ్బంది గృహ సందర్శన ద్వారా సర్వేను నిర్వహించాలని ప్రతి జ్వరం కేసును డెంగ్యూ అనుమానిత కేసుగా భావించి ఆర్డిటి టెస్టులు చేయాలన్నారు. డెంగ్యూ వ్యాధికి లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందించాలని కోరారు. ఆర్డిటి ద్వారా డెంగ్యూ అనుమానిత కేసులను డెంగీ నిర్ధారణ కోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేసి ఎలిసా టెస్ట్ ద్వారా డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. మలేరియా సబ్ యూనిట్ అధికారులు నోడల్ సూపర్వైజర్లు వారి వారి పి హెచ్ సి, సెక్టార్ పరిధిలో డెంగీ నిర్ధారణ కేసులు వచ్చిన వెంటనే 50 ఇళ్లలోపు స్ప్రే నిర్వహించాలని 100 గృహముల వరకు యాంటీ లార్వెల్ మెజర్స్ నిర్వహించాలని కోరారు. ఫ్రైడే రైడ్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బందితోపాటుగా ప్రజలంతా భాగస్వాములు అయ్యేలా చూడాలని ప్రతి గృహం వద్ద వారి వారి నివాసముల వద్ద నీటి నిల్వలను తొలగించి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారులు అందరూ వారి సబ్ యూనిట్ పరిధిలో నూతనంగా డెంగ్యూ కేసు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆంటీ లార్వల్ మెజర్స్ పకడ్బందీగా నిర్వహించాలని డెంగ్యూ నియంత్రణలో ఎవరు నిర్లక్ష్యం చేయరాదని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ సిబ్బందిని హెచ్చరించారు.ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి నియంత్రణలో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ప్రభుత్వానికి సహకరిస్తూ వారి రిపోర్టులను తగిన సమయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి చేరవేయాలని సూచించారు. జిల్లా లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా నమోదవుతున్న డింగి కేసుల వివరాలు ఆధారంగా సమీక్షించారు ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ డెంగీ పరీక్షలను సకాలంలో నిర్వహించి డెంగ్యూ కేసు సంబంధించిన ఏరియా వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు.

ఇంకా ఈ సందర్భంగా బ్రీడింగ్ చెక్కర్స్ ప్రతిరోజు వారి వారి విధుల్ని చక్కగా నిర్వహించినప్పుడే మలేరియా,డెంగీ సంబంధిత దోమల లార్వాలను నియంత్రించవచ్చని తెలియజేశారు. నిజామాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నoదు వల్ల పట్టణ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మారుమూల గిరిజన తండాల్లో డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా చూడాలని కోరారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనతా వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ డెంగీ నిర్ధారణ అయిన 24 గంటల్లో స్ప్రే యాంటీ లార్వెల్ మెజర్స్ నిర్వహించాలన్నారు. అదేవిధంగా దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిబ్బందిని కోరారు. జిల్లా ఉపా వైద్యాధికారిని నిజామాబాద్ డివిజన్ డాక్టర్ అంజన, డిస్టిక్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button