*ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు* *త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి*
- నిజామాబాద్, సెప్టెంబర్ 17 :(నిఘానేత్రం ప్రతినిధి) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా
రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఛైర్మన్ అనిల్, పుర ప్రముఖులకు, అధికార అనధికారులకు కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో నగర మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర సహకార ఫెడరేషన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు సీ.పీ కోటేశ్వరరావు, జెడ్పీ సీ.ఈ.ఓ ఉషా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
*జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్*
ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ సీఈఓ ఉషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.