*సర్దార్ వల్లభాయ్ పటేల్ తోనే తెలంగాణ కు విముక్తి*
*నిజామాబాద్, సెప్టెంబర్ 17( నిఘానేత్రం ప్రతినిధి )
భారత ప్రథమ హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దూర దృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై విముక్తి పొందిందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ అన్నారు.హైదరాబాద్ సంస్థానం యూనియన్ లో కలిసిన సెప్టెంబర్ 17 చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా జిల్లాకోర్టు చౌరస్తాలో ఆయన జాతీయ జెండా ను ఎగురవేసి ప్రసంగించారు. విముక్తి నిజాం రజాకార్ల కు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని యూనియన్ లో కలపడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని ఆయన చెప్పారు.కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు ,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి దొన్పల్ సురేష్,కోశాధికారి దీపక్ ,న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, మానిక్ రాజు,దయాకర్ గౌడ్, గోపాల్ రెడ్డి, సురేష్,ఆశా నారాయణ,బిట్ల రవి, తదితరులు పాల్గొన్నారు.