*ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ*
నిజామాబాద్, సెప్టెంబర్ 17( నిఘానేత్రం ప్రతినిధి )
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ k జన్మదినం సందర్బంగా సేవ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఇందూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమం నిర్వహించి, గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతు భారతమాత ముద్దుబిడ్డ మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవాలాందిస్తున్న నరేంద్రమోదీ గారు నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం అని అన్నారు…
ఆ మహనీయుని జన్మదినం సందర్బంగా భారతీయ జనతా పార్టీ సేవ పక్వాడ కార్యక్రమాలు దేశమంతట నిర్వహించడం జరుగుతుందన్నారు..
ఇందూర్ జిల్లాలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.భారతదేశన్ని విశ్వగురువుగా నిలబెట్టలనే సంకల్పంతో, భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్రమోడీ జన్మదినానికి జిల్లా వ్యాప్తంగా సేవకార్యక్రమాలు నిర్వహించి నరేంద్రమోడీగకి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు…
నిరంతరం భారతమాతకు సేవలాందిస్తున్న ఆ మహనీయులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ ఇండెంట్ శ్రీమతి ప్రతిమరాజ్ , బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి , బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ , బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.