*నగరాభివృద్ధికి షబ్బీర్ అలీ కృషి మరువలేనిది* *బీజేపీ ఎమ్మెల్యే, అనుచరులు అసత్య ఆరోపణలు మానుకోవాలి*
నిజామాబాద్ సెప్టెంబర్ 19:(నిఘానేత్రం ప్రతినిధి)నిజామాబాద్ నగరాభివృద్ధికి కోసం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ..షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎప్పటికప్పుడు చర్చిస్తూ నిజామాబాద్ నగర, జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ ఇంజినీరింగ్ కళాశాలగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 10 పాలిటెక్నిక్ కళాశాలలు ఇంజినీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు. అందులో నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఒకటని ఆయన తెలిపారు. ఎంతో మంది పేద విద్యార్థులు తాము కలలుగానే ఇంజినీరింగ్ విద్యను సాకారం చేసుకోవచ్చన్నారు. పాత కలెక్టరేట్ స్థలాన్నిప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే కుట్రపన్నారని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ ప్రాంగణంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియానికి కూడా షబ్బీర్ అలీ ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే బొందెం చెరువు బాధితులకు పునరావాసం, వారికి ఆర్థిక సాయం కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. భారీ వర్షం కారణంగా చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. భారీ వర్షం కారణంగా నాళాలో కొట్టుకుపోయి చనిపోయిన బాలికకు ఆర్థిక సహాయం కింద ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ పెద్దలతో చర్చించి బాలిక కుటుంబానికి నాలుగు లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వపరంగా అందేస్తున్నారన్నారు. ఇవేమీ తెలియని బీజేపీ ఎమ్మెల్యే, అతడి అనుచరులు షబ్బీర్ అలీపై అవాకులు చవాకులు పేలుస్తూ, లేనిపోని అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని వీటన్నింటినీ వెంటనే మానుకోవాలని, లేకపోతే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ రామర్తి గోపి, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ప్రీతం, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ మహేశ్, కేశ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.