*ఈరోజు పోషణ మాసం సందర్బంగా డిచ్ పల్లి ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
నిజామాబాద్ సెప్టెంబర్ 21:(నిఘానేత్రం ప్రతినిధి)ఈరోజు పోషణ మాసం సందర్బంగా డిచ్ పల్లి ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో డిచ్ పల్లి నియోజకవర్గం యం యల్ ఏ శ్రీ భూపతి రెడ్డి గారు పాల్గొని అందరూ పోషకాహారం అనగా సమతుల్య ఆహారం తీసుకోవాలని, అంగన్వాడీ టీచర్స్ యొక్క సేవలు దేశ అభివృద్ధి లో కీ లక పాత్ర పోషిస్తారని, అంగన్వాడీ కేంద్రాలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు, ఈ కార్యక్రమం లో మహిళా కమిషన్ సభ్యురాలు సూదాం లక్ష్మీ గారు , తారా చంద్ నాయక్ గారు జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి మేడం గారు, జిల్లా ఆరోగ్య శాఖాధికారి రాజశ్రీ గారు, సీడీపీఓ స్వర్ణ లత గారు,డిచ్ పల్లి మండలం యొక్క నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు మెడికల్ ఆఫీసర్ సంతోష్ గారు, అంగన్వాడీ సూపర్ వైజర్ లు మమత, బుజ్జి,రాధా లక్ష్మీ, సరిత సునీత, శోభ,వరలక్ష్మి,ఏ యన్ యం లు, అంగన్వాడీ టీచర్ లు, ఆశాలు, లబ్దిదారులు, డీ హెచ్ ఈ డబ్ల్యూ జిల్లా సమన్వయ కర్త స్వప్న, ఐ టి ప్రకాష్, పోషణ్ అభియాన్ సమన్వయ కర్తలు, యన్ రాంబాబు, రంజిత్ పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున తల్లులు, పిల్లలు పాల్గొని శ్రీమంతాలు, అక్షరాబ్యాసం, అన్న ప్రాసన వేడుకలు నిర్వహించడం జరిగింది, ప్రీ స్కూల్ పిల్లల ద్వారా నిర్వహించిన ప్రీ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి