Politics
*హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం*
నిజామాబాద్, సెప్టెంబర్ 21 :(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్ కె.సురేందర్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా, జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నిజామాబాద్ ఆర్దీవో రాజేంద్రకుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.