Business

*భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో అందరూ భాగస్వాములు కావాలి* *బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి*

నిజామాబాద్ సెప్టెంబర్ 24:(నిఘానేత్రంప్రతినిధి)

దేశ ప్రజల సంక్షేమం కోసం మంచి సిద్ధాంతాలతో పాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో అందరూ భాగస్వాములు కావాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. మంగళ వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి మాట్లాడుతూ..దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఏకతాటిపై ఉండాలని, దేశంలోని చిట్టచివరి అనగారిన వర్గాలకు పూర్తి సంక్షేమ ఫలాలతో న్యాయం అందాలనే రెండు సంకల్పాలతో భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. బిజెపి నిర్వహించే సభ్యత్వ నమోదు మహా యజ్ఞంలో బిజెపి ప్రతి కార్యకర్త నుంచి నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ భాగస్వాములై విజ యవంతం చేయాలని కోరారు. ప్రతి బూత్ కి 100 కుపైగా సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 50వేల వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేసుకుందని వెల్లడించారు.మెగా సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని

ఈనెల 25న దీన్ దయాల్ 108 జయంతిని పురస్కరించుకొని 48 గంటల పాటు నిర్వహించే మెగా సభ్యత్వ నమోదులో బిజెపి శ్రేణులు తప్పకుండా భాగస్వాములై రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదులో జిల్లాని ముందు ఉంచాలని కోరారు. దీన్ దయాల్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయన్నారు. జిల్లాలోని గ్రామాల వారీగా నష్టపరిహారం పై జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లావ్యాప్తంగా నష్టపోయిన వివరాలను జిల్లా యంత్రాంగం పూర్తిగా సేకరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హులైన రైతులకు రుణమాఫీ అందజేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 85 వేల మందికి మాత్రమే రుణమాఫీ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. పదవుల ఏర్పాటు, ఉత్సవాలకు ఇచ్చిన సమయం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ అందజేసి జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, గద్దె భూమన్న రచ్చ సుదర్శన్ బిజెపి నాయకులు లోకం గంగారెడ్డి, కర్క గంగారెడ్డి,రాజన్న,నక్క రాజేశ్వర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button