Business

*లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన పార్లమెంట్ భవనం లోని ప్రధాన కమిటీ హాల్ లో జరుగుతున్న 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశం*

న్యూఢిల్లీ సెప్టెంబర్ 24: లోక్ సభ స్పీకర్ శ్రీ ఓంబిర్లా అధ్యక్షతన పార్లమెంట్ భవనం లోని ప్రధాన కమిటీ హాల్ లో జరుగుతున్న 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( CPA ) ఇండియా రిజీయన్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న తెలంగాణ శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి డిప్యూటి చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్ లేజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి నరసింహా చార్యులు, జాయంట్ సెక్రెటరీ ఉపేందర్ రెడ్డి.ఈరోజు జరిగిన ” *సుస్థిరమైన అభివృద్ధిలో శాసన వ్యవస్థల పాత్ర”* అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రసంగిస్తూ…

సుస్థిరమైన అభివృద్ధి అనేది సామాజికంగా, ఆర్ధికంగా, పర్యావరణ పరంగా ప్రస్తుత కాలంతో పాటుగా భవిష్యత్తు తరాలకు కూడా వర్తిస్తుంది. భారతదేశంలోని పార్లమెంట్, రాష్ట్రాల శాసన వ్యవస్థలు సుస్థిరమైన అభివృద్ధి కొరకు ఉద్యేశించిన చట్టాలను రూపొందించడం, అవసరమైన నియమాలను రూపొందించడంతో పాటుగా వాటి అమలును నిత్యం వివిధ స్థాయిలల పర్యవేక్షిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరమైన అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి పేదరికం, అసమానత్వం, పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పులపై 2015 లో రూపొందించిన నియమాలు మన పార్లమెంట్, రాష్ట్రాల శాసన వ్యవస్థలకు మార్గదర్శకాలుగా ఉన్నాయి.మన పార్లమెంట్ లో , రాష్ట్రాల శాసనసభ లలో సుస్థిరమైన అభివృద్ధి అమలు కోసం నిత్యం సమావేశాలు, సమాలోచనలు, చర్చలు జరపడం, చట్టాల రూపకల్పన, నియమావళి రూపొందించడం జరుగుతుంది. పార్లమెంట్ కమిటీలు అయిన పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ స్టాండింగ్ కమిటీలు చట్టాల రూపకల్పనలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. 1986 లో రూపొందించిన పర్యావరణ పరిరక్షణ చట్టం, 1980 లో రూపొందించిన అటవీ సంరక్షణ చట్టం శాసన వ్యవస్థల నిబద్దతకు నిదర్శనం.సుస్థిరమైన అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వాలు కెటాయించే విదంగా శాసన వ్యవస్థలు కృషి చేస్తున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా రూపొందించడం ద్వారా ప్రభుత్వాలు పేదలకు ఉపాధి కల్పించడాన్ని హక్కుగా మార్చాయి.అదేవిదంగా ప్యారీస్ ఒప్పందానికి అనుగుణంగా సస్థిరమైన అభివృద్ధిలో భాగస్వామ్యమైన అంతర్జాతీయ కమిటీలపై పార్లమెంట్ విభాగాలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం నూతనంగా 2014 లో ఏర్పడింది. అయినా సస్థిరమైన అభివృద్ధిలో చెప్పుకోదగిన మార్పును నమోదు చేస్తుంది. శాసనసభ, శాసనమండలిల సహకారంతో క్షేత్ర స్థాయిలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది.

సుస్థిరమైన అభివృద్ధి కోసం తెలంగాణ శాసనసభ రూపొందించిన చట్టాలు రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టాలతో తెలంగాణ రాష్ట్రం విద్య, ఆరోగ్యం, సమానత్వం, పరిశుభ్రమైన త్రాగునీరు, ఆర్ధిక వృద్ధి వంటి రంగాలలో జాతీయ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో ఉండడానికి దోహదం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2023 లో అధికారం లోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తుంది. అధికారం లోకి వచ్చిన మొదటి వారం రోజుల లోనే ప్రభుత్వ ఆర్ టీ సి బస్సులలో రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గృహ వినియోగ గ్యాస్ సిలెండర్ పథకాలను అమలు చేసింది. ఈ రెండు పథకాల అమలు రాష్ట్రంలో మహిళా సాధికారతకు తోడ్పడింది.

అదేవిదంగా పేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించడానికి ఉద్యేశించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈ పెంపుదలతో పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడే పేద గృహ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి రాష్ట్రంలోని చిన్న, మద్య తరహా రైతాంగం మేలు కోసం దేశ చరిత్రలో మొదటిసారిగా రెండు లక్షల రూపాయల రుణమాఫి అమలు చేయడం జరిగింది. ఈ రుణమాఫితో రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు జరగడంతో పాటుగా తిరిగి రైతులు కొత్త రుణాలను పొందడానికి అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరాభివృద్ధిలో తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఉంటున్నాయి.

2030 సంవత్సరానికి భారతదేశ సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో చట్టసభలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ పాలన వ్యవస్థ, కమ్యూనిటీ భాగస్వామ్యంతో క్రియాశీల పాత్ర పోషించాలని అభిప్రాయపడుతున్నాను.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button