*నేషనల్ కోపరేటివ్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి*
నిజామాబాద్(నిఘానేత్రం ప్రతినిధి)ఈరోజు ఢిల్లీలో నేషనల్ కోపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దిలీప్ సంఘానే ఆధ్వర్యంలో నిర్వహించిన NCUI వార్షిక మహాజన సభలో తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారు పాల్గొని సంస్థను ఉద్దేశించి మాట్లాడుతూ సహకార సంఘాలలో పెరిగిపోతున్న నీరాశ నిర్లక్ష్యం, అదేవిధంగా సహకార సంగానికి సభ్యులకు మధ్య ఉన్న భారీ అగాధాన్ని పూడ్చే విధంగా ప్రజలు రైతులు సహకార సంఘం అంటే మాది అని అనుకోవాలి అంటే మరొక్కసారి ప్రజలకు రైతులకు సహకార సంఘాల పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేషనల్ కోపరేటివ్ యూనియన్ తీసుకోవాలి దానికి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్లు సహకరించినప్పుడే గ్రామాలలో సహకార యూనియన్ యొక్క మనుగడ కొనసాగుతుందని , నేషనల్ కోపరేటివ్ యూనియన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు తెలుపుతామని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు.సహకార సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి,సహకార సంఘాలకు ఎక్కువగా ప్రచారం నిర్వహించడం ద్వారా గ్రామాలలో ఆదరణ లభించే అవకాశం ఉందని ,సహకార ఉద్యమాన్ని మరొక జాతియ ఉద్యమంగా మలిచే విధంగా జాతీయ కోపరేటివ్ యూనియన్ చర్యలు తీసుకోవాలని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా వున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు..