*ధర్మపురి శ్రీనివాస్ కు ఘన నివాళులు అర్పించిన ఎంపీ అరవింద్*
నిజామాబాద్ , సెప్టెంబర్ 27(నిఘానేత్రం ప్రతినిధి )
ప్రతిరోజు ప్రజల కోసం పరితపించి తన రాజకీయ జీవి తాన్ని అంకితం చేసి… ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజల మనిషి ధర్మపురి శ్రీనివాస్ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ధర్మపురి శ్రీనివాస్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద గల డి.శ్రీనివాస్ ఘాట్ వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… ధర్మపురి శ్రీనివాస్ తన కు రాజకీయ గురువు అని తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ రాజకీయాల గతీతంగా ప్రజా సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేశారని తెలిపారు. ప్రజాసేవే ధ్యేయంగా ధర్మపురి శ్రీనివాస్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య, బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.