*సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభానికి వచ్చిన సినీ హీరో రామ్ పోతినేని హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎంపీ అరవింద్ ధర్మపురి ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త*
నిజామాబాద్ సెప్టెంబర్ 27:(నిఘానేత్రం విలేకరి):
35వ సిఎంఆర్ షాపింగ్ మాల్ ను నిజామాబాద్ కేంద్రంగా జోయాలుకాస్ జెవెలరీస్ పక్కన గురువారం ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్త రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సినీ తారలు హీరో రామ్ పోతినేని, హీరోయిన్ సందడి చేశారు. అభిమానుల కేరింతల మధ్య హీరో హీరోయిన్లు స్టేజిపై ఎక్కి అభిమానులకు అభివాదం చేశారు. వేల సంఖ్యలో అభిమానులు సెల్ఫీలు దిగుటకు వారిని చూసేందుకు మహిళలు సైతం పోటీపడ్డారు. వేలాదిమంది అభిమానుల మధ్య సీఎంఆర్ అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ తనకు చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టమని అన్నారు. నిజామాబాద్ పట్టణం తనకు కొత్తేం కాదని చాల సార్లు వచ్చానని మీ అభిమానానికి చాల్ థాంక్స్ అని చెప్పింది. సీఎంఆర్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల లేడీస్ చీరలు చుడిదార్ గగ్రాలు, పట్టుచీరలు అన్ని న్యూ స్టాక్స్ లను అతి తక్కువ ధరల్లో అందిస్తున్న ఏకైక ట్రస్టెడ్డ్ సంస్థ CMR ,అని తెలిపారు. హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ జూలరీస్ అంటే దేశవ్యాప్తంగా మన్నిక గల బ్రాండ్ అని దానికి తాను అంబాసిడర్ గా కొనసాగుతున్నందుకు గర్వపడుతున్నాను అన్నరు. కస్టమర్లకు వేరే షాప్ ల కంటే తక్కువ ధరలలో మన్నిక గల వస్త్రాలను అందిస్తున్న సంస్థ CMR అన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మరియు ఇతర జిల్లాల కస్టమర్లు మహిళలు వచ్చి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సందర్భంగా కొనుగోలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో CMR నిర్వాహకులు వెంకటరావు, ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త నగర మేయర్ దండు నీతూ కిరణ్ 45 వ డివిజన్ కార్పొరేటర్ హేమలత శ్రీనివాస్, బిజెపి నాయకులు నగర ప్రముఖులు పాల్గొన్నారు.