రేపు అజీద్ గారికి త్యాగరాయ గాన సభలో అవార్డు నా గురువు షేక్ అబ్దుల్ అజీద్ గారికి హృదయపూర్వక అభినందనలు … శుభాకాంక్షలు !!!
రేపు అజీద్ గారికి త్యాగరాయ గాన సభలో అవార్డు
నా గురువు షేక్ అబ్దుల్ అజీద్ గారికి హృదయపూర్వక అభినందనలు… శుభాకాంక్షలు
#తురకవాడ కవితా సంపుటి ఒకటి చదివితే చాలు! అజీద్ ఎవరు? ఏమిటి? ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? తాను పుట్టి పెరిగిన సమాజం పట్ల ఒక జర్నలిస్టుగా, రచయితగా, కవిగా, సీనియర్ తెలుగు పత్రికా సంపాదకులుగా అనుభవం ఏమిటి? అభిప్రాయం ఎలా ఉంది? అర్థమవుతుంది.
మరోవైపు అజీద్ అంటే సీనియర్ జర్నలిస్టు పత్రికా సంపాదకులు తురకవాడ కవి అని తెలిసిన పత్రిక సాహిత్య రంగంలోని మిత్రులకు సున్నితమైన ఆయన వ్యక్తిత్వం, సునిశితమయిన పరిశీలన, తాను చేసే పని పట్ల నిబద్ధత, స్వీయ క్రమశిక్షణ, గమ్యాన్ని ఎంచుకోవడంలోనే కాదు నిత్య గమనశీలిగా తనను తాను సరైన తొవ్వలో పెట్టుకోవడం ఇటువంటి సవ్యసాచులకే చెల్లుతుంది.
అడుగడుగునా తన (నేపథ్యం తెలిసి) విజయాలకు అడ్డుపడుతూ తొక్కేయాలని చూసిన వారిని కూడా చిరునవ్వుతో క్షమించగలిగే స్నేహశీలి. అందుకే తనను ఎంతమంది అణచివేయాలని చూసారో కాదు తాను ఎంతమందికి చేయూతనిచ్చానో మాత్రమే గుర్తుపెట్టుకున్నారు.
షరీఫా బీ, ఖాజా మొహియుద్దీన్ ల సంతానంగా
ఉమ్మడి నల్గొండ జిల్లా గడ్డిపల్లి గ్రామంలో తొలి అడుగులు వేసిన అజీద్, అందరు యువకుల్లాగే హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. యవనంలో ఏమేమి కలలు గన్నారో నాకు తెలియదు గానీ బహుశా వాటన్నిటిని కష్టపడి ఇష్టపడి సాధించుకున్నారని మాత్రం రూఢిగా చెప్పగలను.
ప్రస్తుతానికి వస్తే రేపు అనగా శనివారం సెప్టెంబర్
28న, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ శృతిలయలు ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సిల్వెల్ కార్పొరేషన్, ఆదర్శ ఫౌండేషన్ సంస్థల సహకారంతో పద్మభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలలో భాగంగా “సిల్వెల్ శృతిలయలు అక్కినేని మీడియా ఎక్సలెన్సీ అవార్డు – 2024″ను, శ్రీ త్యాగరాయ గాన సభ చిక్కడపల్లిలో అందుకోబోతున్నారు శుభాకాంక్షలు
యోహన్ సీనియర్ జర్నలిస్టు