*డీఎస్ స్మారకార్థం క్రీడలు నిర్వహించడం గొప్ప విషయం* *విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి* సినీ హీరో ఆకాశ్ పూరీ
నిజామాబాద్ సెప్టెంబర్ 27:(నిఘానేత్రం ప్రతినిధి)
విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడలతోని చదువులో రాణిస్తారని సినీ హీరో
ఆకాశ్ పూరీ అన్నారు. శుక్రవారం
డీఎస్ స్మారక క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆకాశ్ పూరీ, ధర్మపురి సురేందర్, మాజీ ఎంపీపీ పుప్పాల శోభ పాల్గొన్నారు.
మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన స్మారకార్థం 23 నుంచి నిజామాబాద్ 27 వరకు నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అధ్యక్షులు ధర్మపురి సంజయ్ వారి తండ్రిగారి స్మృతిలో భాగంగా నగదు బహుమతి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షో అలరించాయి.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించాలంటే క్రీడలు తప్పకుండా ఆడాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, నాకు క్రీడలు అంటే ఎంతో ఇష్టమని, సెలవు రోజుల్లో తప్పకుండా పాల్గొనే వాడినని అన్నారు. నిజామాబాద్ తో నాకు అనుబంధం ఉందని గుర్తు చేశారు.