*క్రీడల ప్రోత్సాహానికి మానాల ట్రస్టు ద్వారా సహాయం అందిస్తాం* — *మానాల మోహన్ రెడ్డి*
ఈరోజు కమ్మర్పల్లి మండలంలో పాఠశాల క్రీడా పోటీల ముగింపు సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా నిర్వాహకులను, క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నారాని ఆయన తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో రాబోయే ఐదు సంవత్సరాలు క్రీడల నిర్వహణ కొరకు నిర్వాహకులకు 25వేల రూపాయలు, ఛాంపియన్గా నిలిచిన మొదటి పాఠశాలకు పదివేల రూపాయలు, రెండవ విజేతకు 5000 రూపాయలు మానాల ట్రస్టు ద్వారా అందిస్తామని మానాల మోహన్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఛాంపియన్ గా నిలిచిన చౌటుప్పల్ ఉన్నత పాఠశాలకు పదివేల రూపాయలు బహుమతిగా అందజేశారు. వచ్చే సంవత్సరం నుండి క్రీడా నిర్వాహకులకు 25వేల రూపాయలు, మొదటి విజేతకు పదివేల రూపాయలు రెండవ విజేతకు 5000 రూపాయలు అందిస్తామని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు.