Politics

*జీవధాన్ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి* *అమాయకులను కేసుల్లో ఇరికించవద్దు వారి భవిష్యత్తు దెబ్బతింటుంది* *జీవధాన్ ఘటనపై పోలీసుల చర్యలు అభినందనీయం* *రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ*

కామారెడ్డి, సెప్టెంబర్ 30(నిఘా నేత్రం విలేఖరి )

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ స్కూల్లో జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు.సోమవారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవ దాన్ హైస్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై పాఠశాల పీ టీ వికృత చేష్టలకు పాల్పడిన విషయంలో పోలీసులు స్పందించిన తీరు అభినందనీయమని అన్నారు. ఈ విషయం టీవీల్లో చూసి చాలా బాధపడ్డాను అని తెలిపారు.

విద్యార్థి సంఘాలు పాఠశాలకు వెళ్లి పాఠశాల యజమాన్యంతో మాట్లాడడంతో పాటు అదే సమయంలో పాఠశాల యజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి పాఠశాలకు వచ్చి పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పడంతోనే ఆ సమయంలో అల్లరి మూకలు కొందరు పాల్గొని ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైనట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో సీఐ చంద్రశేఖర్ రెడ్డికి తలకు ఎస్సై రాజారాం ఏఎస్ఐ హజారుద్దీన్ కు గాయాలతో తో పాటు మరో హెడ్ కానిస్టేబుల్ కు కాలు విరిగింది అన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వి గాయాల పాలు చేసిన వారిని సిసి ఫుటేజీలో గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసిందన్నారు .వారితోపాటు కొంతమంది అమాయకుల పై కూడా పోలీసులు కేసులు నమో చేసినట్లు వారి భవిష్యత్తుకు ఇబ్బందులు ఏర్పడతాయని అలాంటి వారిని గుర్తించి కేసుల నుంచి తొలగించాలని జిల్లా ఎస్పీ ఐజీ లను కోరినట్లు తెలిపారు . ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఐజి లను కోరినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి లో శాంతియూత వాతావరణము ఉందని మతపరమైన అల్లర్లు ఏమి లేవని తెలిపారు. తాను ముస్లిం ను అయినా 90 శాతం హిందువులే తనను నియోజకవర్గంలో గెలిపించి ఎమ్మెల్యేను మంత్రిని చేశారని ముస్లింల హిందువుల దేవాలయాలకు తాను ఎంతో అభివృద్ధి పనులు చేశానన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం, మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయం, వద్ద అభివృద్ధి పనులు తాను మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినట్లు తెలిపారు. కామారెడ్డి లో మంచి వాతావరణం ఉందని పేర్కొన్నారు.రాష్ట్రంలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందా అని జర్నలిస్టులు కొంతమంది ప్రశ్నించగా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని షబ్బీర్ అలీ అన్నారు. తాను ఇప్పటికే మంత్రిగా 10 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఆపోజిషన్ లీడర్ గా ఐదు సంవత్సరాలు పనిచేశానని తెలిపారు. అధిష్టానం నిర్ణయిస్తే ఆ దేవుడు కరుణిస్తే మంత్రి గా బాధ్యతలు చేపడతానన్నారు. బి ఆర్ఎస్ కు చెందిన కేటీఆర్, హరీష్ రావు లకు హైడ్రా గురించి మాట్లాడే అర్వతలేదని వారికి బుద్ధి ఉండాలని షబ్బీర్ అన్నారు . తాము ప్రతిపక్ష హోదాలో ఉండి మాజీ హోంమంత్రి జానారెడ్డి తాను కలిసి మల్లన్న సాగర్ ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళితే మధ్యలోనే తమన్న అడ్డగించి మూడు గంటలు అటు ఇటు రోడ్డుపైనే వానాల్లో దింపి 12 గంటల పాటు అరెస్టు చేశారన్నారు. అప్పుడు వాళ్ళ బుద్ధి ఎటుపోయిందో అని అన్నారు. పై కమిషన్కు ఇంజనీర్లు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు హైడ్రా ద్వారా పేదల ఇళ్లను కూల్చ బో మని అక్రమ కట్టడాలను మాత్రమే కులుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎఫ్ టి ఎల్ లో ఉన్న వాటిని కు లుస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, గూడెం శ్రీనివాస్ రెడ్డి ,పండ్ల రాజు, ప్రతిభ రమేష్ లక్ష్మారెడ్డి ,అంజద్ , గుడుగుల శ్రీనివాస్, ఐ రే నీ సందీప్ కుమార్ ,దోమకొండ శ్రీనివాస్ ,బాలరాజు, వడ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button