*రాజరాజేశ్వర పొల్యూషన్ సెంటర్ అక్రమాలు* *పొల్యూషన్ సెంటర్ పేరుతో దౌర్జన్యంగా వసూలు* *ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వసూళ్ల సమయం* *మత్తులో ఉంటూ రోడ్డు అడ్డంగా నిలబడి కాపలా కాశి మరీ బలవంత వసూలు* *లంచాల మత్తులో అధికారులు?*
నిజామాబాద్ అక్టోబర్ 1:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగరంలోని సారంగాపూర్ రోడ్డు ప్రాంతంలో రాజరాజేశ్వర పొల్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ వసూళ్లు ఉంటాయి రాత్రంతా వాహనాలు నడిపి అలసిపోయి ఉన్న వాహనాలను ఆపి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా బండి కాగితాలు ఉన్నాయా వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేకుంటే మీపై కేసు చేస్తామని బెదిరిస్తూ వేళల్లో వసూలు చేస్తున్నారు. పొల్యూషన్ సెంటర్ అధికారాలు నామ మాత్రమే ఎవరైనా మాకు పొల్యూషన్ సర్టిఫికెట్ కావాలని తమ దగ్గరికి వస్తే వారికి పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది కానీ రహదారికి అడ్డంగా ఉదయాన్నే మత్తులో ఉండి బలవంతంగా వాహనాలు ఆపి బలవంత వసూళ్లకు పాల్పడుతున్నారు. శనివారం వచ్చిందంటే వాళ్లకు పండుగే పండుగ ఎందుకంటే శనివారం రోజున నవీపేట్ మేకల సంత ఉంటుంది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త అన్ని జిల్లాల నుండి మేకల కొనుగోలు కొరకు వ్యాపారస్తులు వస్తుంటారు వస్తున్న వారిని బలవంతంగా ఆపి మామూలు వసూలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు వీటన్నిటిని చూస్తూ చూచి చూడనట్టు ఆర్టీవో అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈ బలవంతపు వసూళ్లలో ఆర్టీవో అధికారులకు కూడా వాటాలు ఉన్నాయా అందుకే ఈ బలవంతపు వసూళ్లు యదేచ్చగా చేస్తున్నారా ఇంత బహిరంగంగా వసూలు జరుగుతున్నా వాళ్లు ఆ పొల్యూషన్ సెంటర్ పై చర్యలు తీసుకోక పోవటానికి ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు