Politics

*MSME – 2024 పాలసి లో బీసీల అంశాలను చేర్చడానికి మార్పులు – చేర్పులకు మేధోమధన సదస్సు* *MSME లో ఎస్సి ,ఎస్టీ లకు ఇస్తున్న సబ్సిడీ లు బీసీ లకు వర్తింపజేయాలి* *MSME (సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు) ఆద్యులు , హక్కుదారులు బీసీలు* *రాష్ట్రం లో ప్రతి బీసీ కుటుంబం ఒక మైక్రో యూనిట్ – మంత్రి పొన్నం ప్రభాకర్*

హైదరాబాద్ అక్టోబర్1:(నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ – 2024 లో ఇతర వర్గాలకు ఇచ్చిన మాదిరి బీసీలకు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేసుకొని బీసీ ల అంశాలను చేర్చేందుకు సానుకూలంగా స్పందించడంతో సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హల్ లో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు తో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేదావులు , రిటైర్డ్ ఐఎఎస్ లు ,బీసీ ఎమ్మేల్యేలు , కార్పోరేషన్ చైర్మన్లు , పారిశ్రామిక వేత్తలతో మేదోమదన సదస్సు నిర్వహించారు.

 

ఈ సమావేశంలో రిటైర్డు జాతీయ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎంఎస్ఎంఈ చుక్కా కొండయ్య తో పాటు రిటైర్డు ఐఎఎస్ లు , మేధావులు ,పారిశ్రామికవేత్తలతో కలిపి కమిటీ వేయడానికి నిర్ణయించారు. ఎంఎస్ఎంఈ లో బీసీ లకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు వారి సలహాలు సూచనలు తీసుకొని అందులో చేర్చాల్సిన అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు సమావేశంలో పలు కీలక సలహాలు సూచనలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీ దేశంలోనే బెస్ట్ పాలసీ గా అభివర్ణించారు. ఇందులో ఇతర వర్గాలకు ఇచ్చిన మాదిరి బీసీ లకు కూడా కల్పిస్తే వారిలో పారిశ్రామిక అభివృద్ధి సాధించవచ్చని ఆకాంక్షించారు.

 

మేధోమధన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ లో బీసీ లకు సంబంధించిన ఎలాంటి అంశాలు చేర్చలేదని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు బీసీ కులాలకు సంబంధించిన కుల వృత్తులే అధికంగా ఉంటాయని ఎంఎస్ఎంఈ పాలసీ లో బీసీ లకు సబ్సిడీ లు ఇతర అంశాలు చేరిస్తే లక్షలాది కుటుంబాలు ఈ పాలసీ ద్వారా ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు స్వతహాగా కుల వృత్తులు మోడర్న్ టెక్నాలజీ తో పెట్టుకొని ఆర్థిక వృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది తెలిపారు. సమావేశంలో రిటైర్డు ఐఎఎస్, మేదావులు లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబం ఒక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం తెలిపారు. గోల్డ్ స్మిత్ ,రజక ,నాయి బ్రాహ్మణ ,తదితర చేతి వృత్తుల వారికి బీసీ ల అంశాలు చేరిస్తే ఎంఎస్ఎంఈ లో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పాలసీ ద్వారా రకరకాల వృత్తిలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ వస్తె ఎన్నో పరిశ్రమలు రానున్నాయని రిటైర్డు ఐఎఎస్ లు సూచించారు. బీసీ లకు ఆర్థికంగా ఫైనాన్స్ సపోర్ట్ ,భూ కేటాయింపు చేస్తే లక్షలాది కంపనిలు వచ్చే అవకాశం ఉందన్నారు. కులవృత్తులు జీవనోపాధి గా చేసే వారినీ పక్కన పెట్టీ ఎంఎస్ఎంఈ ముందుకు పొదని తెలిపారు. ఎంఎస్ఎంఈ లో 40 రకాల స్టార్టప్ లు ఉన్నాయని అందులో 20 రకాల స్టార్టప్ లు వృత్తులకు సంబంధించినవి అని అధికారులు వెల్లడించారు.

 

జాతీయ ఎంఎస్ఎంఈ లో ఎస్సి ఎస్టీ లకు ఇస్తున్న సబ్సిడీ ల్లో బీసీ ,మైనారిటీ డిసెబుల్ వాళ్ళకి కూడా ఇవ్వాలని రిటైర్డు ఐఎఎస్ చిరంజీవులు సూచించారు. ఎంఎస్ఎంఈ లో బీసీ లకు ప్రత్యేక పాలసీ విధానం ఉండాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో బీసీ లకు అందించవచ్చని సూచించారు. రాష్ట్రంలో 65 మంది మహిళలు ఉన్నారు వారికి నారిశక్తి ద్వారా 10 శాతం సబ్సిడీ ఉందని వారి పేరు మీద పరిశ్రమలు స్థాపిస్తే ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చని తెలిపారు.

 

ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ జనరల్ చుక్కా కొండయ్య పలు సూచనలు చేశారు బీసీ లు ఎలాంటి ఎంటర్ ప్రైజేస్ పెట్టుకుంటే బాగుంటుంది .నేను సాధించగలనా అనే దానిపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.బీసీ యూత్ ను పాలసి లో ఎలా పొందుపర్చగలం ఏ యూనిట్ ఎక్కడ పెట్టాలి..? ఎలా అనే దానిపై బీసీ యూత్ కి అవగాహన కల్పించి బీసీ యూత్ లో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వడ్డెర కులస్తులకు గతంలో ఉన్న జీవో ను అమలు చేస్తూ క్వారీలో తమకి 25 కేటాయించాలని ఎంబీసీ కార్పోరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ కోరారు. గ్రామ గ్రామాన మత్యకారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సూచించారు. ప్రతి ఏరియా లో ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఎస్ఎంఈ లో మార్పులు చేసి 10 శాతం మార్పు జరిగిన బీసీ లకు న్యాయం జరుగుతుందని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. ప్రభుత్వాలు కుల వృత్తులు పై ఆధారపడే వారిని గుర్తించి సహకరిస్తే బడుగుల్లో అభివృద్ది జరుగుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. రజకుల యొక్క దినచర్య సమాజంలోని మలినాన్ని విముక్తి చేయడమే మా దినచర్య. రజకుల వృత్తిలో మొడరైజేశన్ కి సహకరించాలని కోరారు. చెరువుల్లో మట్టి తీయడానికి కుమ్మర్లకు ,వృత్తులు మీద ఆధారపడే వారికి సహకారం అందించాలని కోరారు.

 

ఎంఎస్ఎంఈ పాలసీ లో చేర్చే ప్రాథమిక అంశాల పై బీసీ సంక్షేమ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అందులోని అంశాలు కమిటీ నిర్ణయించే అంశాలను పాలసీలో చేర్చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు.

 

 

సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మేల్యేలు ప్రకాశ్ గౌడ్ , వీర్లపల్లి శంకర్ ,బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం,కమిషనర్ బాల మాయాదేవి, రిటైర్డు ఐఎఎస్ లు చిరంజీవులు చోలేటి ప్రభాకర్ , దినకర్ బాబు ,జాతీయ ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ జనరల్ చుక్కా కొండయ్య, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఎంబీసీ కార్పోరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్ ,ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ మధుకర్ బాబు,పారిశ్రామిక వేత్తలు ,ఇతర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button