Politics

*తప్పిదాలకు తావులేకుండా సమగ్రంగా డిజిటల్ కార్డుల సర్వే* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

 

 

నిజామాబాద్, అక్టోబర్ 03 :(నిఘానేత్రం ప్రతినిధి) కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం సాంపల్లిలో, ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపల్ వార్డు నెంబర్-2 పరిధిలో కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యామిలీ డేటా బేస్ ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా అన్ని వివరాలను సక్రమంగా పొందుపర్చాలని అన్నారు. ఇంటి నెంబరు, చిరునామా, కుటుంబ యజమాని ఎవరు, ఇతర కుటుంబ సభ్యులకు యజమానితో గల సంబంధం వంటి వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత సమయంలోపు పైలెట్ సర్వేను పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఏ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా నూటికి నూరు శాతం డిజిటల్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా, డిజిటల్ కార్డుల పైలెట్ సర్వే కోసం జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి రాంపూర్ గ్రామంతో పాటు ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని వార్డు నెం-2 ను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా బాల్కొండ సెగ్మెంట్లో బాల్కొండ మండలం శ్రీరాంపూర్, భీంlగల్ మున్సిపల్ 7 వార్డును, బోధన్ నియోజకవర్గంలో బోధన్ మండలం లంగ్దాపూర్, బోధన్ మున్సిపాలిటీలోని 25వ వార్డును, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి 38, 45వ డివిజన్లను, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో డిచ్పల్లి మండలం సాంపల్లి, నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్ ను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి డిజిటల్ సర్వే ప్రక్రియ జరిపిస్తున్నామని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత అధికారులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button