*సాలు రా చెక్ పోస్ట్ ఆదాయానికి అడ్డా* *మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు అవడం డబ్బులు నిండుగా దండుకుంటున్న చెక్ పోస్ట్ సిబ్బంది* *ప్రతి ఒక వాహనం ఆపి వారికి డబ్బు ఇవ్వవలసిందే* *డబ్బులు ఇస్తే తనిఖీ చేయడము ఏమి ఉండదు దర్జాగా పంపిస్తారు* *బక్రీద్ కు వాహనాల్లో ఆవులను గేదెలను తరలిస్తున్న పట్టించుకోకుండా దండిగా వసూళ్లు చేసే నిండుగా సంపాదించుకున్న సిబ్బంది* *నిజామాబాద్ జిల్లా నుండి బిలోలి కి మేకలు కొనడానికి ప్రతి మంగళవారం మేకల సంతకు వెళుతుంటారు వచ్చే ప్రతి వాహనం మామూలు విచ్చి వెళ్ళవలసిందే* *ఇంత ఆదాయం ఉన్న చెక్ పోస్ట్ పోస్టింగ్ కొరకు ఎన్నో పైరవీలు* *ఇన్ని అక్రమాలు జరుగుతున్న ఆ చెక్ పోస్ట్ సిబ్బందిపై అధికారుల చర్యలు శూన్యం*
నిజామాబాద్ అక్టోబర్ 3:(నిఘానేత్రం ప్రతినిధి) మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు అయిన సాలురా చెక్పోస్ట్ అక్రమ అవసులకు పెట్టిన పేరు ఎన్నోసార్లు వార్తల్లో వచ్చిన వసూలు చేయడం ఆగడం లేదు. గతంలో బక్రీద్ పండుగ సందర్భంలో మహారాష్ట్ర నుండి వేల లక్షల్లో ఆవులు గేదెలు నిజామాబాద్ జిల్లాకు ఇతర జిల్లాలకు ఎన్నో వాహనాల్లో తరలించడం జరిగింది ఆ వాహనాలను తనిఖీ చేసి లక్షల్లో వసూలు చేసే సంపాదించుకున్నారు. ప్రతి మంగళవారం బిలోలి లో మేకల సంత ఉంటుంది నిజామాబాద్ నుండి నిజామాబాద్ చుట్టుపక్కల నుండి మేక మోసం వ్యాపారం చేసే వ్యక్తులు ఆ అంగడికి వెళ్లి మేకలను కొనుగోలు చేసుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రతి వాహనం కూడా వారికి మామూలు చెల్లించి వెళ్ళవలసిందే లేదంటే సిబ్బంది వాళ్లపై దౌర్జన్యం చేయడం దుర్భాషలాడడం బండిని పోనివ్వకుండా నరకయాతన పెట్టి పీడించి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇలాంటి చెక్ పోస్ట్ పై గతంలో ఇతర పత్రికల్లో కూడా ఎన్నో వార్తలు వచ్చాయి అయినప్పటికీ సంబంధిత అధికారులు ఆ చెక్ పోస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు