*నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో “స్వచ్ఛత పక్వాడ” శ్రమదానం* *స్వచ్ఛత…. జీవన విధానం కావాలి : రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ (ADFM) సాల్వన్ సంగ*
నిజామాబాద్, అక్టోబర్ 03:(నిఘానేత్రం ప్రతినిధి)
స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని హైదరాబాద్ రైల్వే డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ (ADFM) సాల్వన్ సంగ తెలిపారు.*
నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో గురువారం “స్వచ్ఛత పక్వాడ”లో భాగంగా రైల్వే స్టేషన్ ప్లాట్ పామ్, రైల్వే ట్రాక్, తదితర ప్రదేశాలలో శ్రమదానం నిర్వహించారు.*
ఈ సందర్భంగా హైదరాబాద్ రైల్వే డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ (ADFM) సాల్వన్ సంగ మాట్లాడుతూ…. స్వచ్ఛత పక్వాడను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఒక్కరోజు కార్యక్రమంలా కాకుండా నిత్యజీవితంలో పరిశుభ్రత విధానాన్ని పాటించాలన్నారు. అపరిశుభ్ర పరిసరాల నుంచి పరిశుభ్రత దిశగా, అనారోగ్యం నుంచి ఆరోగ్య దిశగా, కాలుష్యం నుంచి స్వచ్ఛత దిశగా దేశాన్ని ముందుకు నడిపించే మహత్తర కార్యక్రమం స్వచ్ఛతా పక్వాడ అన్నారు. ప్రజల అలవాట్లలో పెనుమార్పు తీసుకువచ్చి పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీటవేసే అతిపెద్ద కార్యక్రమం అన్నారు.*
*ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ సదాశివుడు, హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ సాగర్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ దీప, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉదయ్, నిజామాబాద్ జంక్షన్ రైల్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.*