*న్యాయవాదులపై పోలీసుల దాడికి వృతిరేకంగా నిరసన* *జిల్లా న్యాయవాదులు రెండురోజులు విధులకు దూరం* *జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియషన్ అందోళన*
*
నిజామాబాద్, అక్టోబర్ 03(నిఘానేత్రం ప్రతినిధి )
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది గా ప్రాక్టీస్ చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ కలీమ్ పై పోలీసుల భౌతిక దాడి అత్యoత హేయమైన చర్యగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆక్షేపించింది.
గురువారం జిల్లాకోర్టుప్రాంగణంలోని
సమావేశపు హల్ లో నిర్వహించిన బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, వి.భాస్కర్, పరుచూరి శ్రీధర్ ,మద్దెపల్లి శంకర్ లు మాట్లాడుతూ చట్టప్రకారం విధులు నిర్వహించాల్సిన పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం క్షమించరాని నేరాలని వారు స్పష్టంచేశారు.చట్టాలు బలమైన ఆయుధాలని ,వాటి ప్రకారమే తప్పు చేసిన,చట్టాన్ని చేతిలోకి తీసుకుని చట్టవిరుద్దంగా న్యాయవాది పై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన మదన్న పెట్ పోలీసులను అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల పై పోలీసుల బౌతిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సమాయత్తం కావలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. అనంతరం బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసుల అరాచకాలు, హింస పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మహమ్మద్ అబ్దుల్ కలీమ్ పై దాడి చేసిన మదన్నపేట్ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యులైన పోలీస్ అధికారులను తక్షణమే తక్షణమే సస్పెన్షన్ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదుల వృత్తి ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల చట్టవ్యతిరేకమైన చర్యలకు నిరసనగా గురువారం, శుక్రవారం రెండు రోజులు జిలాకోర్టు ప్రాంగణంలోని కోర్టులలో విధులకు హాజరుకాకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సమావేశం అనంతరం జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ముందు నిలబడిన న్యాయవాదులు మదన్నపేట్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మదన్నపేట్ పోలీసుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.దీర్ఘకాలిక పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ కార్యాచరణ రూపొందిస్తున్నదని మల్లెపూల జగన్మోహన్ మోహన్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి దొన్పాల్ సురేష్,న్యాయవాదులు మధుసూదన్ రావు,కవిత రెడ్డి,మానిక్ రాజ్ , ఆశా నారాయణ,పడిగల వెంకటేష్, నగేష్,రవీందర్, నల్ల సుభాష్ రెడ్డి,ఇంతియాజ్, కేశవరావు ,ఆయూబ్ ,విశ్వక్ సేన్ రాజ్ ,భానుచందర్ ,తదితరులు పాల్గొన్నారు.