*శుక్రవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సన్మాన సభను విజయవంతం చేయండి* *జిల్లా ప్రజలకు,కాంగ్రెస్ కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపు*
నిజామాబాద్ , అక్టోబర్ 03(నిఘానేత్రం ప్రతినిధి )
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాత కలెక్టర్ గ్రౌండ్ (సన్మాన సభ స్థలం) వద్ద గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జిల్లా కు చెందిన మహేష్ కుమార్ గౌడ్ నియమితులవ్వడం ఎంతో ఆనందంగా వుంది అని,రాష్ట్ర అధ్యక్షులు గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నిజామాబాద్ కు వస్తున్న సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కి ఘనంగా స్వాగత ర్యాలీ, బహిరంగ సన్మాన సభను నిర్వహించడం జరుగుతుందని కావున జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మానాల మోహన్ రెడ్డి కోరారు.కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు వుంటుంది అనడానికి మహేష్ కుమార్ గౌడ్ నిదర్శనమని,కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయిలో ఎన్ ఎస్ యు ఐ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ ఎన్నో పదవులు నిర్వహిస్తూ నేడు రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగారని ఆయన అన్నారు.శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్ స్వాగత ర్యాలీలో భాగంగా మధ్యాహ్నం 1:00 గంటలకు మాధవ్ నగర్ లోని సాయిబాబా ఆలయం నందు పూజలు నిర్వహించి అక్కడి నుండి బయలుదేరి బొర్గం బ్రిడ్జి వద్ద 1:30 నిమిషాలకు ఓపెన్ టాప్ జీపులో ర్యాలీ ప్రారంభమై పులాంగ్ మీదుగా ఎల్లమ్మ గుట్ట చౌరస్తా మీదుగా మధ్యాహ్నం 3:00 గంటల వరకు పాత కలెక్టర్ గ్రౌండ్ లో గల సభ స్థలానికి ర్యాలీ చేరుకుంటుంది.అదేవిధంగా సన్మాన సభకు వచ్చిన వారు వారి వాహనాలను నిలిపేందుకు మూడు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు జరిగిందని సభ పక్కన పాత కలెక్టర్ ఆఫీస్ మైదానం,పాత ఎండిఓ కార్యాలయం నందు,ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్ద పార్కింగ్ కు స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా రేపు ఘన స్వాగతం ర్యాలీ, బహిరంగ సభకు రావడానికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చే క్రమంలో చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బంది వుంటుంది కావున పోలీసు వారు ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూడాలని,ప్రజలు కూడా రేపు మీకు ఎదురయ్యే ఇబ్బందులకు మమ్మల్ని ముందుగానే మన్నించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్,పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు,పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్,పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,జిల్లా యూత్ అధ్యక్షులు విక్కీ యాదవ్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, ఆశ్రాఫ్,గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.